- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొతెరాలో ‘నమో’స్తే ట్రంప్
దిశ, వెబ్‌డెస్క్ : మొతెరా(సర్దార్ పటేల్) స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం ఉత్తేజకరంగా సాగింది. సుమారు లక్ష మంది ప్రజలు హాజరైన నమస్తే ట్రంప్ కార్యక్రమం ఇరుదేశాల జాతీయ గీతాలతో మారుమోగింది. ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ‘నమస్తే ట్రంప్’ అంటూ మొదలుపెట్టగా.. డొనాల్డ్ ట్రంప్ కూడా నమస్తే అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
హూస్టన్‌లో నిర్వహించిన హౌడీ మోడీ కార్యక్రమంలో తాను పాల్గొన్న సందర్భాన్ని ప్రధాని మోడీ గుర్తుచేస్తూ.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్.. అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన చారిత్రాత్మక పర్యటనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతున్నారని వివరించారు. మొతెరా గుజరాత్‌లో ఉన్నది కానీ, ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం దేశపు భావోద్వేగమని చెప్పారు. అమెరికా స్వేచ్ఛా దేశమైతే.. మొత్తం ప్రపంచాన్నే తమ అతిథిగా భావించేది భారత్ అని ఇరుదేశాలను ప్రధాని పోల్చారు. యూఎస్‌లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందని తెలిపారు.
నమస్తే.. నమస్తే అంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్‌ను అమెరికావాసులు ప్రేమిస్తారని చెప్పారు. ఈ పర్యటనతో తమ హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానముంటుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాను ప్రారంభించడం ఆనందంగా ఉన్నదని వివరించారు. స్వేచ్ఛ, చట్టబద్ధపాలన, స్వతంత్రత భారత్‌కు ఆభరణాలని అన్నారు. టెర్రరిజంపై కలిసిపోరాడుతారని చెప్పారు. అలాగే, రక్షణ రంగానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వివరించారు.
Read also..