మోడల్ ని రేప్ చేసిన స్టార్ హీరో.. మరో 8 మందితో కలిసి..

by Anukaran |   ( Updated:2021-07-14 01:52:32.0  )
model
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై కి చెందిన ఒక మోడల్ బాలీవుడ్ నటులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 8 మంది బాలీవుడ్ ప్రముఖులు తనను రేప్ చేసారని తెలుపుతూ వారి పేర్లను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే.. ముంబై మోడల్ అపెర్నా (28) అనే మోడల్ గత కొద్దీ రోజుల క్రితం తనను కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు అత్యచారం చేసారని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి వద్దనుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని మరోసారి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా ఆ వ్యక్తుల పేర్లను తెలుపుతూ తన ఇన్స్టా లో ఒక పోస్ట్ పెట్టింది.

” నన్ను, నా కుటుంబాన్ని, నా పెంపుడు జంతువులను.. వారు కొట్టారు. నా పేరును అపవాదు చేశారు, నన్ను దుర్వినియోగం చేసారు, నా మనస్సు మరియు శరీరంపై దాడి చేశారు, నన్ను ఏ ఉద్యోగానికి వెళ్లనీయకుండా చేశారు. నాకు శ్రేయోభిలాషులుగా సమాజానికి చూపిస్తూనే.. నాపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.. హీరో జాకీ భంగ్నానీతో పాటు ఫొటోగ్రాఫర్ కోల్స్టన్ జులియన్, టీసిరీస్‌కు చెందిన క్రిష్ణన్ కుమార్, నిఖిల్ కామత్, షీల్ గుప్తా, అజిత్ ఠాకూర్, గుర్ జ్యోత్ సింగ్, విష్ణు ఇందూరి, క్వాన్ ఎంటర్‌టైన్మెంట్‌కు చెందిన అనిర్బన్ బ్లా నన్ను రేప్ చేశారు.. నేను ఈ వ్యక్తులలో ఎవరితోనూ సన్నిహితంగా లేను, వారు నాకు స్నేహితులు కాదు అని చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. వారు పోలీసులను మరియు కోర్టును ఎలా కొనడానికి ప్రయత్నిస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు. అయినా నేను ముందడుగు వేశాను” అని చెప్పుకొచ్చింది. కేసు పెట్టినా ఇప్పటికీ తనకు బెదిరింపులు వస్తున్నాయని, కొందరు వ్యక్తులు తనకు ఫోన్ చేసి.. చంపేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఈ మీ వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి

Advertisement

Next Story