మంచు లక్ష్మి తనయ స్వరాభిషేకం

by Shyam |   ( Updated:2024-06-01 15:01:50.0  )
మంచు లక్ష్మి తనయ స్వరాభిషేకం
X

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు మనవరాలు, మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ మహాశివరాత్రి పర్వదినాన స్వరాభిషేకం చేసింది. ఆ పరమేశ్వరుడికి చిరు కానుక అందించింది. తద్వారా సంగీత సామ్రాజ్యంలోకి అడుగుపెట్టింది చిట్టితల్లి. మనోజ్ మంచు బ్యానర్‌పై నిర్మించిన ‘అయిగిరి నందిని’ మ్యూజిక్ ఆల్బమ్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది మంచు కుటుంబం. తన పాటతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన నిర్వాణ ఎనలేని ప్రశంసలు అందుకుంటుంది. చిన్నారి వాయిస్‌ను కొనియాడుతున్న మంచు ఫ్యాన్స్ తన చిన్ని స్వరాలకు నటరాజు కూడా నాట్యమడతాడని కొనియాడుతున్నారు. భవిష్యత్‌లో తాతకు మించిన కీర్తి ప్రతిష్టలు తన సొంతం కావాలని మహాశివున్ని కోరుకుంటున్నారు.

మ్యూజిక్ వీడియోలో నిర్వాణ యాటిడ్యూట్ సూపర్ అంటున్న అభిమానులు తాతకు మించిన మనవరాలు.. తల్లిని మించిన ఘనురాలు అవుతుందని పొగుడుతున్నారు. ప్రతీ విషయంలో మద్దతు ఇచ్చే మంచు లక్ష్మీ లాంటి తల్లి ఉంటే ఇలాంటి వండర్ కిడ్స్ చాలామంది పుట్టుకొస్తారని అంటున్నారు. వీడియోలో మంచు లక్ష్మి, మనోజ్‌లు నిర్వాణకు సపోర్ట్ చేస్తూ కనిపించగా ఈ వీడియో తెలుగు ప్రజలకు ఫెస్టివ్ ట్రీట్‌గా ఉంటుంది.

Advertisement

Next Story