- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహీంద్రా వారి ఫ్రీ కరోనా పాలసీ
దిశ, వెబ్‌డెస్క్: ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా వాహనదారులకు పండుగ ఆఫర్‌ను ప్రకటించింది. బొలేరో పిక్-అప్ వాహనాన్ని కొనుగోలు చేసే వారికి కరోనా వైరస్ బీమా పథకాన్ని అందించనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పండుగ ఆఫర్ కింద బొలెరో పిక్-అప్ వాహనాన్ని కొన్న యజమానితో పాటు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు(ఇద్దరు పిల్లల వరకు) రూ. లక్ష వరకు పాలసీ కవర్‌ను అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.
బొలెరో పిక్-అప్ శ్రేణి వాహనాన్ని అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య కొన్నవారు బీమా పథకాన్ని పొందవచ్చని, ఇందులో పిక్-అప్ మాక్సీ ట్రక్, సిటీ పికప్, కాంపర్ వాహనాలకు ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఉచిత బీమా పథకం కొనుగోలు చేసిన తేదీ నుంచి తొమ్మిదిన్నర కాలానికి ఈ బీమా చెల్లుతుందని కంపెనీ తెలిపింది. ‘పిక్-అప్ వాహనాలను వినియోగించే వారు తమ కస్టమర్లతో నేరుగా సంబంధాలను కలిగి ఉంటారు. కరోనా లాంటి పరిస్థితుల్లో వారు భౌతిక దూరాలను పాటించడంలో జాగ్రత్తలను పాటించినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి.
అలాంటి వారికోసమే మహీంద్రా సంస్థ కరోనా బీమా పాలసీని అందిస్తోంది. ఈ ఆఫర్‌ను మహీంద్రా సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా పారంభించనున్నట్టు’ ఎంఅండ్ఎం కస్టర్ కేర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సతీందర్ సింగ్ బజ్వా చెప్పారు. ఈ బీమా సౌకర్యాన్ని అందించేందుకు మహీంద్రా కంపెనీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వాహన యజమాని లేదా అతని కుటుంబ సభ్యులు కరోనా సోకి ఆసుపత్రిలో చేరినప్పుడు లేదంటే క్వరంటైన్‌లో ఉన్నప్పుడు కరోనా పాలసీ వర్తిస్తుందని కంపెనీ వివరించింది.