- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్‌ఎస్‌లో ఆ నలుగురికి ఎమ్మెల్సీ ఫిక్స్?
దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురికి టికెట్ ఖరారైనట్లు సమాచారం. మరో ముగ్గురి పేర్లను అధిష్టానం ఖరారు చేయనుంది. ఎమ్మెల్సీ టికెట్ కన్ఫామ్ అయిన వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. కాగా గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్‌గా పని చేశారు. అదే విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. సీఎం కేసీఆర్ కు విధేయుడు కూడా. గుత్తాకు మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదేవిధంగా తక్కెళ్లపల్లి రవీందర్ రావు మొదటినుంచి టీఆర్ఎస్ లో పని చేస్తున్నారు. నల్లగొండ ఎన్నికల ఇన్చార్జిగా పని చేస్తున్నారు. ఆయనకు గతంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పినప్పటికీ ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. కేసీఆర్ కుటుంబానికి, మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లకు విధేయుడు, సన్నిహితుడు కూడా. దీంతో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఆరు స్థానాలకు గాను మూడు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా.. మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించి పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం. నల్గొండకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు ఎంసీ కోటిరెడ్డికి ఓ మంత్రి హైదరాబాద్ కు రావాలని సూచించగా.. వచ్చి ఎమ్మెల్యే కోటర్స్ లో ఉన్నట్లు తెలిసింది.