కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ పోచం పల్లి..

by Shyam |   ( Updated:2021-11-30 06:20:10.0  )
కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్సీ పోచం పల్లి..
X

దిశ హన్మకొండ టౌన్: వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేటీఆర్ ను కలిశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ పోచం పల్లిని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లను కేటీఆర్ అభినందించారు.

Advertisement

Next Story