ఈటలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Shyam |
Palla Rajeshwar Reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల మాట్లాడేది ఒకటి.. చేసేది మరొకటి అన్నారు. ఈటల రాజేందర్ రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నారని విమర్శించారు. ఆయనపై పార్టీ అధ్యక్షుడు ఏ చర్య కావాలంటే ఆ చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు.

40ఎకరాల అసైన్డ్ భూమిని రైతుల దగ్గర నుంచి తీసుకున్నట్లు ఈటల స్వయంగా ఒప్పుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీజేపీతో కలిశాక ఈటల బహుజన వాదం, వామపక్షవాదం ఎక్కడకు పోయిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను కలిశాను అంటున్న ఈటల ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed