రైతులకు వెంటనే… పరిహారం చెల్లించాలి : ఎమ్మెల్సీ

by Shyam |   ( Updated:2020-08-24 09:56:06.0  )
రైతులకు వెంటనే… పరిహారం చెల్లించాలి : ఎమ్మెల్సీ
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని నేలపట్ల గ్రామంలో ఈదుల వాగును ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామంలోని ఈదులవాగు భారీ ప్రవహించడంతో, గ్రామంలో వందల ఎకరాల పంటనష్టం జరిగిందని అన్నారు.

దీంతో నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం మందోళ్ళగూడం గ్రామపంచాయతీలో ఇంటింటికీ వాటర్ క్యాన్స్, ఏటీడబ్ల్యూ కార్డ్స్ పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ… తాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story