- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి జీతాలు పెంచండి.. మండలిలో కేసీఆర్‌ను కోరిన కవిత
దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. కవిత చొరవతో ప్రభుత్వం స్పందించి వెంటనే గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో మంగళవారం మండలిలో మరో అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రంలో మొత్తం 142 అర్బన్, లోకల్ బాడీస్ ఉన్నాయని, అందులో ఒక కోటీ 44 లక్షల మంది జనాభా ఉన్నట్లు వెల్లడించారు.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేందుకు అర్బన్, లోకల్ బాడీస్‌లో ఉన్న 3,618 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎంతో కృషి చేస్తున్నట్లు కవిత సభ దృష్టికి తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచుల గౌరవ వేతనాలను ఎలాగైతే పెంచారో.. ఈసారి 3,618 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల వేతనాలు పెంచాలని ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్‌ను కోరారు.