వ్యవసాయంపై ఆంక్షలు ఎందుకు.. ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఆగ్రహం

by Sridhar Babu |
వ్యవసాయంపై ఆంక్షలు ఎందుకు.. ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఆగ్రహం
X

దిశ, జగిత్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్రౌన్‌ రైస్‌పై ఆంక్షలు విధించడం సరికాదని.. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రకమైన వరి ధాన్యంపై ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర పొందుపర్చకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి కేంద్రానికి సపోర్ట్ చేయడం ఏంటని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దంపుడు బియ్యానికి ఆంక్షలు విధించకుండా మద్దతు ధర కల్పించాలని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed