ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

by Shyam |
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ కోటాలో 6 స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. వీటితో పాటు వచ్చే ఏడాది జనవరి 4న స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ ఎన్నికలకు ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌కు నోటిఫికేషన్ మంగళవారం వెలువడింది. నేటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 17న పరిశీలన, 22న ఉపసంహరణ, 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడనుంది.

23 నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ కాగా.. 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ, డిసెంబర్ 10న పోలింగ్, 14వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఖాళీ అవుతున్న 12 స్థానాల్లో ఆదిలాబాద్ జిల్లా నుంచి పురాణం సతీష్ కుమార్, వరంగల్ జిల్లా నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి సైరా చిన్నపరెడ్డి, మెదక్ జిల్లా నుంచి భూపాల్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఖమ్మం జిల్లా నుంచి బాలసాని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుంచి భానుప్రసాద్ రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, సుంకరి రాజు పదవీకాలం జనవరి 4న పూర్తి అవుతుంది. వీటికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed