- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందకొడిగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఆయా పార్టీలు తమ ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించాయి. అక్కడి నుంచి నేరుగా శుక్రవారం ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. వైద్య సిబ్బంది ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేసిన తర్వాతే పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. మొత్తం 37 కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 5, 326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
వీరితో పాటు కో ఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు 65 మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే కొంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల సభ్యులు ఒక్క ఓటు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దగ్గరుండి మరి పోలింగ్ కేంద్రాలకు తమ వెంట తీసుకెళ్లి ఓటు వేయిస్తున్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.