సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇషాక్ బాషా..

by srinivas |
MLC CANDIDATE
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, నంద్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఇషాక్‌ బాషా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి తన పేరును ఖరారు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఇషాక్ బాషా వెంట.. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, వైసీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్‌ బాషా ఉన్నారు.

Advertisement

Next Story