మున్సిపాలిటీ ఆటోలో ఎమ్మెల్యే పర్యటన

by Shyam |
మున్సిపాలిటీ ఆటోలో ఎమ్మెల్యే పర్యటన
X

దిశ, మహబూబ్‌నగర్: ఎవరికి వారు సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా బారి నుంచి కాపాడుకోవాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మక్తల్‌లో ఆదివారం నిర్వహించిన మటన్ మార్కెట్ వద్దకు ఆయన మున్సిపాలిటీ ఆటోలో వచ్చారు. ఈ సందర్భంగా ఆటోలో నుంచే మైక్‌లో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. సామాజిక దూరం పాటించే విషయంలో అధికారులు కూడా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కాగా, ఎమ్మెల్యే హోదాలో ఉండి ఇలా ఒంటరిగా ఎలాంటి బందోబస్తు లేకుండా మున్సిపాలిటీ ఆటోలో రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.

Tags: MLA chittem ram mohan reddy, toured, Municipality Auto, mahaboobnagar

Advertisement

Next Story