- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్‌దే ’
దిశ, ఇందల్వాయి : తెలంగాణ రాష్ట్రంలో గత 70 ఏళ్ళల్లో ఏనాడు కూడా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన సందర్భం రూరల్ నియోజకవర్గంలో లేదని అలాంటి నియోజకవర్గంలో నేడు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే స్థాయికి రూరల్ నియోజకవర్గం చెరుకుందంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లేనని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం మండలంలోని 56 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి, శాధిముబారక్ చెక్కులను అందించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కరోనా కాలంలో 12 కోట్ల రూపాయలతో బీజేపీ పాలిత రాష్టాల ప్రజలను స్వస్థలాలకు పంపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్టానికి అన్ని రంగాల్లో మొండి చేయి చూపుతూ దొంగ పాలనా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రేస్ బీజేపీ పార్టీలు ఓట్ల కోసం నాటకాలు చేస్తున్నారని అలాంటి పార్టీలకు చెందిన వ్యక్తులను నిలదీయాల్సిన అవసరం ప్రజలపై ఉందని పేర్కొన్నారు.
మాజీ సర్పంచ్ సదానంద్ కుటుంబానికి పరామర్శించిన ఎమ్మెల్యే
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఇందల్వాయి మాజీ సర్పంచ్ డాక్టర్ సదానంద్ తండ్రీ ఇటీవలే మృతి చెందగా ఆయన కుటుంబాన్ని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఆయన మృతి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఇందల్వాయి జడ్పీటీసీ సుమన, ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ సతేవ్వ, ఎంపీటీసీ సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ ఆనంద్,సింగిల్ విండో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.