ఆ ప్రాంతాల్లో… స‌హాయ చర్యలు చేపట్టాలి

by Sridhar Babu |   ( Updated:2020-08-18 11:40:06.0  )
ఆ ప్రాంతాల్లో… స‌హాయ చర్యలు చేపట్టాలి
X

దిశ, కొత్తగూడెం: పాల్వంచ మండలంలో విస్తారంగా కురుస్తున్న వ‌ర్షాల‌తో వ‌ర‌ద పోటెత్త‌డంతో జ‌నం ఇబ్బందులు ప‌డుతున్నార‌ని కొత్త‌గూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. వ‌ర‌ద‌లతో జ‌నం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని అన్నారు.

మంగ‌ళ‌వారం పాల్వంచ‌ మున్సిపల్ కార్యాల‌యంలో ఇరిగేష‌న్‌, వైద్యాధికారుల‌తో క‌ల‌సి వ‌ర‌ద‌ల‌పై ఎమ్మెల్యే వ‌న‌మా స‌మీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ… లోత‌ట్టు ప్రాంత ప్ర‌జలు ఇబ్బందులు ప‌డ‌కుండా చూడాల్సిన బాధ్య‌త‌పై అధికారుల‌పై ఉంద‌న్నారు.

Advertisement

Next Story