- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గోదావరిఖని, భూపాల పల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
దిశ, పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఆరు మెడికల్ కాలేజీలకు చేసిన నూతన ప్రతిపాదనల్లో గోదావరిఖని, భూపాలపల్లి పేర్లు కూడా చేర్చాలని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంథనిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కొవిడ్ టెస్టులు పెంచాలని, ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై భారం పడకుండా ఆక్సిజన్‌తో కూడిన ఉచిత అంబులెన్సులు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అంబులెన్స్ సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు.
మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతమున్న అంబులెన్స్‌తో పాటు మరొక అంబులెన్స్‌ను అద్దె ప్రాతిపదికన తీసుకొని రెండు అంబులెన్సుల్లో కూడా ఆక్సిజన్ సిలెండర్‌లను వినియోగిస్తూ పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా డీజిల్ ఇతర వ్యయాలన్ని ప్రత్యేక నిధి కింద ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. మే 21న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కోవిడ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు కాచే శశిభూషన్, మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గెం రాజేష్, పెద్దపల్లి డీసీసీ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ తదితరులు పాల్గొన్నారు.