- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ ప్రక్షాళనపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి: శ్రీధర్ బాబు
దిశ, కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పై శ్వేత పత్రం విడుదల చేయాలని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథనిలో భూ ప్రక్షళన కార్యక్రమంపై పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని 12లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్స్ నేటికీ అందలేదని విమర్శించారు. రెవెన్యూ యంత్రాంగం భూ ప్రక్షాళన చేయడంలో విఫలమైందని దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. కాల్వ శ్రీ రాంపూర్‌లో రైతు రాజిరెడ్డి ఆత్మహత్య ఘటన సమస్య తీవ్రతను ఎత్తి చూపిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఆరేళ్లుగా ల్యాండ్ అసైన్ మెంట్ కమిటీ ఉనికే లేకుండా పోయిందని, పేద ప్రజలకు, అర్హులైన నిరుపేదలకు భూ పంపిణీ నిలిపివేశారని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమికి భూ ప్రక్షాళన పేరుతో వివాదాలు సృష్టించారే తప్ప లబ్దిదారులకు ఏ మాత్రం న్యాయం జరగలేదన్నారు. పాసు పుస్తకాలు లేని కారణంగా రైతు బంధు, రుణమాఫీ, పంట రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ శశిభూషణ్ కాచే, జిల్లా అధ్యక్షులు యాట మల్లారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ నాయకులు సెగ్గం రాజేష్, తోట చంద్రయ్య, దొడ్డ బాలాజీ, పోలుస్తారు శివ, కౌన్సిలర్లు రమ, హనుమంతుడు పాల్గొన్నారు.