- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సార్ తనను కాపాడండి
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వివాదంలో చిక్కుకున్నారు. పేకాట ఆడించి డబ్బులు సంపాదిద్దామంటూ.. అనుచరుడు సందీప్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణ లీక్ చేశాడు. అయితే గతంలో శ్రీదేవికి అనుచరుడిగా ఉన్న సందీప్‌తో ఆమెకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో సందీప్‌పై ఆమె పలు కేసులు పెట్టింది. దీనిపై సందీప్ స్పందిస్తూ.. హామీగా ఉండి ఇప్పించిన డబ్బులు తిరిగి ఇవ్వమన్నందుకే.. ఎమ్మెల్యే తనపై కేసులు పెట్టారని సందీప్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అంతేగాకుండా తనను సీఎం జగన్ ఆదుకోవాలంటూ సందీప్ కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫోన్ సంభాషణ బయటపడటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తాజాగా దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సందీప్‌తో తనకు ప్రాణహాని ఉందని తెలిపింది. ఫోన్ సంభాషణలో ఉన్నది తన వాయిస్ కాదని, అందులో వాయిస్‌ను మార్ఫింగ్ చేశారని వెల్లడించింది. ఆరోపణలు ఎదుర్కొనేందుకు ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం అని ఆమె స్పష్టం చేసింది. అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానంతో చేసే టెస్టింగ్‌కు కూడా తాను సిద్ధం అని సవాల్ విసిరింది. సందీప్‌పై కేసు పెట్టిన కోపంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.