పాలేరుగా పనిచేస్తాను.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Goud |
పాలేరుగా పనిచేస్తాను.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, గూడూరు : నేను మీ ఇంటి బిడ్డను.. మీ గ్రామంలో అభివృద్ధి కోసం పాలేరుగా అయినా పనిచేస్తాను అంటూ టీఆర్ఎస్ మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ, మధనపురం, గాజులగట్టు గ్రామాలలో.. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. 60 యేండ్ల పాలనలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి పనులు చేశానని తెలిపారు. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మండలంలోని దాదాపు 23 మంది అధికారులతో వచ్చామని.. అన్ని సమస్యలను పరిష్కారం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుజాత మోతిలాల్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఖాసీం, తహశీల్దార్ శైలజ, ఎంపీడీఓ విజయ లక్ష్మి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వేం వేంకట కృష్ణా రెడ్డి, వైస్ ఎంపీపీ ఆరే వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed