తీన్మార్ మల్లన్నను నరికేస్తా.. ఇంటికొచ్చి కొడతా: ఎమ్మెల్యే షకీల్

by Shyam |   ( Updated:2021-12-27 03:46:21.0  )
తీన్మార్ మల్లన్నను నరికేస్తా.. ఇంటికొచ్చి కొడతా: ఎమ్మెల్యే షకీల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు రోజుకో కొత్త అంశంపై విమర్శలకు నిలయంగా మారాయి. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వైఫల్యాలు, వరి ధాన్యం కొనుగోళ్లపై విమర్శలు చేసిన బీజేపీ, కాంగ్రెస్.. తాజాగా హిమాన్షుపై చేసిన ట్వీట్‌ వైపు తిరిగాయి. బీజేపీ నేత తీన్మార్ మల్లన్న తన ట్విట్టర్ అకౌంట్లో కేటీఆర్ కొడుకు హిమాన్షుపై చేసిన ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్రదుమారం రేపుతోంది. టీఆర్ఎస్ నేతలు మల్లన్న పై తీవ్రంగా మండిపడుతున్నారు.

అయితే, మల్లన్నపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘ కేసీఆర్ కుటుంబం గురించి మరోసారి మాట్లాడితే ముక్కలుగా నరికేస్తా. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే.. మూడు వందల ముక్కలుగా నరికేస్తాం. ఎక్కువ మాట్లాడితే నేనే ఇంటికి వచ్చి కొడతా. క్రమశిక్షణ గల బీజేపీ తీన్మార్ మల్లన్న కి నేర్పేది ఇదేనా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

హీటెక్కిన బెజవాడ.. వైసీపీ నేతలతో వంగవీటి భేటీ

Advertisement

Next Story