- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, కంటోన్మెంట్: కంటోన్మెంట్ వాసులకు శుభవార్త. భవన నిర్మాణాల నిబంధనలను సడలిస్తూ కంటోన్మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం కంటోన్మెంట్ బోర్డు పాలకమండలి వెరీజ్ బోర్డు తొలి సమావేశం డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయంలో జరిగింది. బోర్డు అధ్యక్షుడు అభిజీత్ చంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఈఓ అజిత్ రెడ్డి, సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ లు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక ఎమ్మెల్యే జి.సాయన్న హాజరయ్యారు. బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బోర్డు ప్రజలు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న భవన నిర్మాణాల (ఎఫ్ ఎస్ ఐ) నిబంధనలను సడలిస్తూ తీసుకున్న నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపింది. సడలించిన నిబంధనల మేరకు భవన నిర్మాణాల్లో సెల్లార్, స్టీల్ టు, స్టేర్ కేస్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఓపెన్ బల్కానీ వంటి నిర్మాణాలకు మినహాయింపు లభిస్తుంది. దీనివల్ల అవినీతి నిర్మూలన, అక్రమ కట్టడాల నివారణకు అడ్డు కట్ట వేసినట్లయింది. దళారులు, బ్లాక్ మెయిలర్ల వ్యవస్థను రూపుమాపేందుకు, అక్రమ నిర్మాణాల నిర్మూలనకు ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గురుశిష్యుల మాటల యుద్ధం..
రాష్ట్ర సర్కార్ జీహెచ్ఎంసీ తరహాలో కంటోన్మెంట్ లో ఉచిత మంచినీటి సరఫరా చేయాలని నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సాయన్న నెల రోజుల్లోగా కంటోన్మెంట్ కు ఉచిత తాగునీటి ఇచ్చేలా ప్రభుత్వంతో ప్రకటన చేయిస్తానని సంచలన ప్రకటన చేశారు. సాయన్న ప్రకటనను రికార్డు చేయాల్సిందిగా రామకృష్ణ కోరడంతో.. సాయన్న అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కార్ ఫ్యాట్నీనాలా వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిందని, టెండర్ ప్రక్రియ కొనసాగుతుందని, రామన్న కుంట ప్రక్షాళనకు రూ.3.50 కోట్లు కేటాయించదని, ముందెన్నడూ రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ కు నిధులు కేటాయించలేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.500 కోట్ల సర్వీస్ చార్జీలు ఎందుకు ఇవ్వడం లేదని సాయన్న నిలదీశారు. దీనిపై రామకృష్ణ స్పందిస్తూ.. సర్వీస్ చార్జీల కోసం డీజీ స్థాయిలో ప్రయత్నాలు నడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం టీపీటీ చార్జీలు ఇవ్వకుండా తప్పించుకుంటుందని ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే సాయన్న (గురువు), జె.రామకృష్ణ( సాయన్న శిష్యుడు)ల మధ్య కొద్ది సేపు మాటల యుద్ధం నడిచింది.
సౌండ్ పొల్యూషన్ పై..
కంటోన్మెంట్ లోని ఓల్డ్ గ్రాండ్ బంగళాలలో నడుస్తున్న ఫంక్షన్ హాల్ వలన శబ్ద కాలుష్యం వెదజల్లుతుందని వచ్చిన ఫిర్యాదుల మేరకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి సౌండ్ పోలుష్యన్ వస్తే మొదటి సారికి రూ. 10 వేలు, రెండో సారి ఉల్లంఘిస్తే రూ. 25వేలు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటికీ ఫంక్షన్ హాల్ నిర్వహాకులు తీరు మార్చుకోకపోతే 7 రోజుల పాటు సీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బోర్డు పరిధిలోని అన్ని పంప్ హౌజ్ లపై సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, నూతన భవన నిర్మాణాల అనుమతులకు బోర్డు ఆమోదం తెలిపింది.