- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాత పోడును వదులుకోం.. కొత్త పోడు కొట్టం: ఎంఎల్ఏ సీతక్క
దిశ, బయ్యారం : పోడు పాత భూములను వదులుకోం, కొత్త పోడు కొట్టం, పోడు భూముల రక్షణకై పోరాడుదాం అని ములుగు ఎంఎల్ ఏ సీతక్క అన్నారు. మండలంలోని కాచనపల్లి గ్రామ పంచాయితి పరిధిలో కాచనపల్లి కింది గుంపు మొట్ల గూడెం , గ్రామంలో ఆదివాసి గ్రామ ప్రజలు ఎంఎల్ఏ సీతక్క సమక్షంలో 80 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పు కొని పార్టీలో చేరారు. వారిలో ఎంఎల్ పార్టి నుండి వార్డు సభ్యులు పాయం రమేష్ , కొట్టేం రామకృష్ణ, గ్రామ దొర పటేల్ టీఆర్ఎస్ పార్టీ నుండి ఇతర నాయకులు పార్టీలో చేరారు .
పార్టీ జెండా ఆవిష్కరణ
గ్రామంలో పార్టి జెండా ను ఎంఎల్ఏ సీతక్క, జిల్లా ప్రెసిడెంట్ జెన్నారెడ్డి , భరత్ చంద్రారెడ్డి , ఆవిష్కరించారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ.. జిల్లాలో పోడు భూములను పేదల నుంచి లాక్కొంటూ హరిత హారం పేరుతో పేదల పొట్ట కొడుతున్నారని వారి పక్షాన గెలిచిన ఈ ప్రాంత ఎంఎల్ఏ, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి భజన పాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో పోడు భూములపై అధికార పార్టీ మాట్లాడకుండా ఉందని, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎంఎల్ఏ లకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం మైకులు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములు కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం ఇచ్చారని, మేము ఇచ్చిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కొంటుందని, ప్రభుత్వం వారి అన్యాయులకు భూములు కట్ట పెడుతోందిని అన్నారు.
ఈ ప్రాంతంలో ఆదివాసులు ఎన్నో సంవత్సరాలుగా సాగు భూములకు కరెంటు , ఇతర లిఫ్టు ఇరిగేషన్ చెక్ డ్యాంలు నిర్మించకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదని , తలాపున గోదావరి పారుతున్నా ఆనీటిని సద్వినియోగం చేసుకోకుండా అడ్డుపడుతున్నారన్నారు. మన నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సీతారాం ప్రాజెక్టు నీరు బయ్యారం చెరువుకు మళ్లీస్తామని నేటికి ఆ పనులు చేయడంలో ఈ ప్రాంత ఎంఎల్ఏ మౌనం వహిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం లో ఎంఎల్ఏ భజన పరులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు . రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోనికి వస్తుందని ఎవరు అదైర్య పడవద్దని పోడు రక్షణకై కలిసి ఉద్యమిద్దాం అని పిలుపు నిచ్చారు
పార్టీ ఆఫీసు ప్రారంబోత్సవం చేయకుండానే.. అసహనంతో వెను దిరిగిన ఎంఎల్ఏ సీతక్క
మండలంలో పార్టీలో చేరిక కార్యక్రమానికి ఎంఎల్ఏ సీతక్క ఉదయం బయలు దేరి వచ్చినా పార్టీ శ్రేణులు ఆమెను దారిలో రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాలేదు . ఉదయమే మండలంలోని కొత్త పేట గ్రామానికి వచ్చి కాచనపల్లి దారి తెలియక పోవడంతో బయ్యారం మండల కేంద్రానికి వెనుదిరగి వెళ్లారు. అక్కడ జిల్లా అద్యక్షుడు, ఇతర మండల నేతలు ఎంఎల్ఏ కు స్వాగతం పలికారు. అందరు కలిసి కాచనపల్లి గ్రామానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమం లో పాల్గొని పార్టీ ఆఫీసు ప్రారంబోత్సవం , కొత్త గూడెం గ్రామం లో పార్టి జెండా ఆవిష్కరణ చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ కార్యక్రమంలో టేకులపల్లి నాయకులు దళ్ సింగ్, లక్కినేని సురేందర్ , రాంచందర్ నాయక్ , మహబూబాబాద్ పార్ల మెంట్ ఇంచార్జి నాయకులు బాలునాయక్, ఎంపిటిసి లక్ష్మి, మోహన్ నాయక్, ఇల్లందు నియోజక వర్గ నాయకులు చీమల వెంకటేశ్వర్లు, రవినాయక్, ఇతర మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.