- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోంది
by Shyam |
X
దిశ ప్రతినిధి, మెదక్:
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ కుటుంబాల నియోజకవర్గాలైన సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాల్లో అభివృద్ధి ఎలా జరిగింది, దుబ్బాకలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత చెరుకు ముత్యంరెడ్డికే దక్కుతుందన్నారు. యువకులు కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Advertisement
Next Story