- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజకీయాలంటేనే సేవ : ఎమ్మెల్యే సీతక్క
దిశ, సూర్యాపేట: రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చోద్యం చూస్తున్నాడని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో జర్నలిస్టులను బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమయంలో ఒక్కొక్కరికీ రూ.6 వేలు ఇచ్చి, 50 కేజీల బియ్యం ఇస్తున్నారని, కనీసం సీఎం కేసీఆర్ రూ. 10 కూడా ఇవ్వడం లేడని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ను పది పది రోజులు పెంచుకుంటూ పోతున్నాడు తప్ప పేదవాడికి ఇంతవరకు ఆర్థికసాయం చేయలేదని విమర్శించారు. రాజకీయాలు అంటేనే సేవ అని సేవ అంటేనే రాజకీయమని అభిప్రాయపడ్డారు.
అధికార దాహంతో అణచివేత ధోరణి చేయకూడదని ఆమె సూచించారు. అంతకుముందు ఆమె ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట కరోనా రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని 36వ వార్డులో పేదలకు రేషన్ సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు వెంక్కన్న, షఫీఉల్లా, అబ్దుల్ రహీం, ఫరూక్, చారి, ధర్మ, సైదులు, చొక్కాయా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.