కేటీఆర్ ట్వీట్‌తో పేపర్ బాయ్ ఫేమస్.. బాలుడిని కలిసిన ఎమ్మెల్యే..

by Sridhar Babu |
కేటీఆర్ ట్వీట్‌తో పేపర్ బాయ్ ఫేమస్.. బాలుడిని కలిసిన ఎమ్మెల్యే..
X

దిశ, జగిత్యాల : మీడియా, సోషల్ మీడియాలో తన మాటలతో వైరల్ అయిన పేపర్ బాయ్ ప్రకాష్‌ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ కలిశారు. జగిత్యాలలోని ప్రకాష్ ఇంటికి వెళ్లి అభినందించారు. కేటీఆర్ ట్వీట్‌తో రాష్ట్రంలోనే కాకుండా.. పక్క రాష్ట్రాలకూ పేపర్ బాయ్ శ్రీ ప్రకాష్ స్ఫూర్తి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడిన మాటలు మీడియా, సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో.. శ్రీ ప్రకాష్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.

ఈ సందర్భంగా శ్రీ ప్రకాష్‌ను బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సూచించారు. శ్రీ ప్రకాష్ చదువుతున్న జగిత్యాల ఓల్డ్ హైస్కూల్‌లో విద్య, మధ్యాహ్న భోజనం వంటి వసతుల గురించి తెలుసుకున్నారు. ప్రకాష్‌కి మంచి భవిష్యత్ ఉందన్న ఎమ్మెల్యే.. బాలుడి తల్లిదండ్రులనూ అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, యూత్ అధ్యక్షుడు గిరి, నాయకులు దావా సురేష్, తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed