మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పటి భవనం..

by Sridhar Babu |
మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పటి భవనం..
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: సత్తుపల్లి ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధికి నిధులు కేటాయించాల‌ని ఆరోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేంద‌ర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య కోరారు. స‌త్తుప‌ల్లి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి భ‌వ‌నాన్ని 1970లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించార‌ని, ప్రస్తుతం భ‌వ‌నం శిథిలావ‌స్థ‌కు చేరుకుంద‌ని అన్నారు. వెంటనే నూతన హాస్పిటల్ భవనాన్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ఖమ్మంలో కోవిడ్- 19 సమీక్ష సమావేశానికి వ‌చ్చిన మంత్రి రాజేందర్‌ను క‌ల‌సి ఎమ్మెల్యే వీర‌య్య వినతిపత్రాన్ని అంద‌జేశారు. అదే విధంగా సత్తుపల్లి, పెనుబల్లిలో ప్రభుత్వ హాస్పిటల్‌లు ప్రధాన రహదారికి ఆనుకోని ఉన్నందున తరచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించడానికి సత్తుపల్లి, పెనుబల్లి హాస్పిటల్లకు 2 నూతన అంబులెన్సులను మంజూరు చేయాలన్నారు. పెనుబల్లి హాస్పిటల్ చుట్టు పూర్వము నిర్మించిన ప్రహరీ ప్రహరీ గోడ శిథిలావ‌స్థకు చేరుకుంద‌న్నారు. ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల‌ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed