- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భక్తులకు షాక్.. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకుంటేనే ఆ జాతరకు అనుమతి..
దిశ, కొమురవెల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ జాతర ఏర్పాట్ల పైన అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ముత్తి రెడ్డి మాట్లాడుతూ.. మల్లన్న దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోవాలన్నారు. లేకపోతే దర్శనానికి అనుమతి ఉండదని తెలిపారు. మాస్కులు, శానిటేజేషన్ గురించి భక్తులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఆలయ వెనుక మెట్ల నుంచి దర్శనము నిలిపివేయాలని సూచించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కీర్తన, జెడ్పీటీసీ సిద్ధప్ప, ఈఓ బాలాజీ, చైర్మన్ భిక్షపతి, ప్రధాన అర్చకులు మల్లికార్జున్, పాలక మండలి సభ్యులు చింతల పార్శారములు, బొంగు నాగిరెడ్డి, పోతుగంటి కొమురెల్లి,ముత్యం నర్సింలు, వెంకట్, అమర్, పోలీసులు పాల్గొన్నారు.