'మా' ఎన్నికల రాజకీయంపై స్పందించిన రోజా

by srinivas |
మా ఎన్నికల రాజకీయంపై స్పందించిన రోజా
X

దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికలు సెగలు పుట్టిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. అంతేకాదు బహిరంగ వేదికలపై ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. దీంతో సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకప్పుడు టికెట్ కొంటేనే కానీ లభించని ఎంటర్‌టైన్మెంట్ టికెట్ కొనక్కర్లేకుండానే ఫ్రీగా చూపిస్తున్నారు సినీనటులు. అంతేకాదు సినీనటులు ఏ ప్యానెల్‌కు మద్దతు పలుకుతున్నారనేదానిపై క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా ఈ మా ఎన్నికలపై సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మా ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయన్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ఎన్నికల ప్రచారం జరుగుతుందని వ్యాఖ్యానించారు. మూవీ ఆర్టిస్ట్‌గా తప్పకుండా ‘మా’ ఎన్నికల్లో పాల్గొంటాను. రెండు ప్యానల్‌లు తమ మ్యానిఫేస్టోను విడుదల చేశాయి. ఎవరి మ్యానిఫెస్టో ‘మా’ అసోసియేషన్‌ సభ్యులకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ ప్యానల్‌కే ఓటు వేస్తానంటూ రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే లోకల్‌, నాన్‌ లోకల్‌లో ఎవరికి ఓటు వేస్తారన్న ప్రశ్నకు రోజా ఆసక్తికర సమాధానం చెప్పారు. వివాదస్పద ప్రశ్నలు తనని అడగొద్దని తెలిపారు. ఈ సారి ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే వాడివేడిగా సాగుతున్నాయని, అందుకే దీనిపై తాను ఏం మాట్లాడాలనుకోవడం లేదన్నారు. కానీ ఓ ఆర్టిస్ట్‌గా తాను ఖచ్చితంగా ‘మా’ ఓటును సద్వినియోగం చేసుకుంటానని, ఎవరి మేనిఫెస్టో ‘మా’ అభివృద్దికి ఉపయోగపడేలా ఉంటుందో ఆ ప్యానల్‌కే ఓటు వేస్తానని రోజా స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed