టీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం.. విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే

by Sridhar Babu |
టీఆర్ఎస్ వినూత్న కార్యక్రమం.. విజయవంతం చేయాలన్న ఎమ్మెల్యే
X

దిశ, గుండాల : ఇంటింటికి కేసీఆర్.. గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా రేపు గుండాల మండలంలోని శెట్టిపల్లి పంచాయతీలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యను తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న అసంపూర్తి పనులతో పాటు ఇతర సమస్యల పరిష్కారం సత్వరమే నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Next Story