- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకేమో కొత్తవి.. నాకేమో డొక్కు వాహనమా..?: రాజాసింగ్
దిశ, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తెలియని వారుండరు. ఈయన ఏదీ మాట్లాడినా సంచలనమే. ఈయన ఎమ్మెల్యే అయినప్పటికీ, ముందుగా నేను హిందూవును అంటారు. హిందూ ధర్మ ప్రచారం నిర్వహించడంలో అగ్రభాగాన ఉండే రాజాసింగ్ అనేక వివాదస్పద అంశాలపై తరుచూగా తన అభిప్రాయాలను మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తీవ్రవాదుల నుంచి థ్రెటన్ ఉందంటూ పోలీస్ విభాగం గుర్తించింది. దీంతో తన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా ప్రభుత్వమే రాజాసింగ్ కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ప్రస్తుతం ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనమే ప్రధాన వివాదంగా మారింది.
కి.మీ రూ.37 లు చెల్లించాలి..
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం, వారి తరుపున ప్రచారం నిర్వహించడం, గెలుపు కోసం నానా రకాల ఎత్తుగడలకు సిద్దం అవుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారానికి సిద్దం అవుతున్నాడు. దీంతో ప్రభుత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. అందులో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలకు వెళితే.. కిలో మీటరుకు రూ.37 లు చొప్పున, డ్రైవర్ కు రోజుకి రూ.100 లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ నగర పోలీసులు నోటీసు పంపించారు. తీవ్రవాదుల నుంచి ప్రాణాలకు ముంపు ఉందని పోలీసులు భావించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. అలాంటిది, మళ్ళీ ప్రభుత్వం నుంచి డబ్బులు చెల్లించాలని నోటీసులు పంపడం వెనుక ఉన్న మతలబు ఏంటా అని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
మీకు కొత్తవి.. మాకు డొక్కువా..?
బహదూర్ పురా స్లాటర్ హౌజ్‌కు అక్రమంగా గోవులను తరలిస్తున్నట్టు పోలీసులతో యుద్దం ప్రకటించిన రాజాసింగ్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించిన నోటీస్ పై స్పందించారు. ప్రభుత్వ ఇంటిలిజెన్స్ విభాగం అధికారులే తీవ్రవాదుల నంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళితే.. రోజుకు కి.మీ రూ.37లు, డ్రైవర్ కు రూ.100లు ఇవ్వాలని చెప్పడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా.. మాకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం డోర్ వేసిన తర్వాత మళ్ళా తీస్తే లాక్ పడుతోందని, లాక్ తీసినా డోర్ ఓపెన్ కాదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులకు కొత్త కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయిస్తూ.. మాకు మాత్రం డొక్కు వాహనాలు కేటాయించారని ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శించారు. అంతే కాకుండా, మాకు కేటాయించిన వాహనం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వాహనం అని చెప్పారు. అయినా.. నాకు గతంలో అనేక నోటీసులు వచ్చాయి.. కానీ, నేనెప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. ఒకవేళ నిజంగా రూల్స్ లో మీరు నోటీస్ లో పంపినట్టుగానే ఉంటే.. సంబంధిత మొత్తాన్ని చెల్లిస్తానని చెప్పాడు. రాజాసింగ్ చేసిన ఈ ఘాటైన వ్యాఖ్యలు తర్వాత పోలీసు శాఖ ఎలా స్పందిస్తోందో చూడాలి.