సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే పొదెం వీరయ్య లేఖ

by Sridhar Babu |
సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే పొదెం వీరయ్య లేఖ
X

దిశ, ఖ‌మ్మం: లాక్‌డౌన్ కాలంలోని విద్యుత్ బిల్లుల‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు సోమ‌వారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీర‌య్య లేఖ రాశారు. టీపీసీసీ పిలుపు మేరకు విద్యుత్‌చార్జీల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ, ముఖ్య‌మంత్రికి రాసిన లేఖ‌ను ఎమ్మెల్యే పొదెం వీర‌య్య కాంగ్రెస్ నాయ‌కుల‌తో క‌ల‌సి ర్యాలీగా భ‌ద్రాచ‌లంలోని విద్యుత్ కార్యాల‌యానికి వెళ్లి అధికారుల‌కు లేఖ అందజేశారు. క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన మూడు నెల‌లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ప‌డినట్టు లేఖ‌లో తెలిపారు. దిన‌స‌రి కూలీలు, కార్మికుల‌కు పనుల్లేక, చిరు వ్యాపారులకు గిరాకీ లేక‌, పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నార‌ని తెలిపారు. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఆదుకోవాల్సింది పోయి విద్యుత్ చార్జీలు పెంచడం అమానుషమ‌ని అన్నారు.

Advertisement

Next Story