- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వానికి చావు డప్పు కొట్టాలి.. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
దిశ, రామాయంపేట: రాష్టాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామాయంపేట మున్సిపల్ పరిధిలో ప్రైవేట్ ఆర్. ఆర్ పిల్లల ఆస్పత్రిని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారన్నారు. యాసంగిలో ధాన్యం సాగు చేస్తే రా రైస్ మాత్రమే కొంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. కాని తెలంగాణలో ధాన్యం నుంచి బాయిల్డ్ రైస్ ఎక్కువగా వస్తుందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని విజ్ఞప్తి చేశారు. కోతుల, పందుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్ సబ్సిడీపై ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌ను ప్రైవేటీకరించిందని, రైల్వేలు, బ్యాంకుల. సింగరేణి, విద్యుత్, వ్యవసాయ మార్కెట్ కమిటీలను ప్రైవేటీకరణకు యత్నిస్తోందన్నారు.
స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా చేసిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తోందని తెలిపారు. కేసీఆర్ పిలుపు మేరకు అన్ని గ్రామాల్లో సోమవారం చావు డప్పు కొట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని, కార్యకర్తలు అందరు పాల్గొన్నాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ విజయలక్ష్మి యాదగిరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ఆరో వార్డు కౌన్సిలర్ దెమె యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.