వానపాములతో ఆదాయం

by Shyam |   ( Updated:2020-07-14 05:04:19.0  )
వానపాములతో ఆదాయం
X

దిశ, మెదక్: రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేట మండలంతో పాటు నస్కల్, నందగోకుల్, రాంపూర్ గ్రామాల్లో డంపింగ్ యార్డులను ఆమె ప్రారంభించారు. దాంతో పాటు అందులో వానపాములను వదిలి, రూ.22లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతువేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… గ్రామ పరిసరాల శుభ్రతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్తబుట్టల్లోనే వేయాలని సూచించారు. తడి చెత్తలో వానపాములను వదలడం వల్ల వర్మీ కంపోస్టు తయారవుతుందని, దీని వల్ల గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందన్నారు. ఆగస్టు 15 తేదీలోగా డంపింగ్ యార్డు, వైకుంఠదామాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. రాంపూర్‌లో గ్రామ అవసరాలకు కొనుగోలు చేసిన పంచాయతీ ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి కోసం ట్రాక్టర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

Next Story

Most Viewed