మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మర్రి.. 2 కేజీల బంగారం విరాళం

by Shyam |
MLA Marri
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములం కావడం అదృష్టంగా భావిస్తున్నామని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్య ఫలితంగానే లక్ష్మీనరసింహుడి ఆలయానికి విరాళం అందచేసే భాగ్యం కలిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి నర్సింహుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు.

యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడానికి దాతలు సహకరించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు ఈ బంగారాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులతో యాదాద్రికి చేరుకున్న ఆయనకు ఆలయ ఈవో గీత ఆధ్వర్యంలో అర్చకులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి దంపతులు ఆలయానికి రెండు కిలోల బంగారాన్ని అందజేశారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Next Story