డిమాండ్ కాదు.. బతిమిలాడుతున్నాం : ఎమ్మెల్యే

by Sridhar Babu |
డిమాండ్ కాదు.. బతిమిలాడుతున్నాం : ఎమ్మెల్యే
X

దిశ, తుంగతుర్తి: వేసవిలో వరి పంట వేయకూడదనే విషయాన్ని తాము ఎక్కడ కూడా డిమాండ్‌గా రైతులకు చెప్పలేదని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ స్పష్టం చేశారు. బుధవారం ఎంపీపీ గుండగాని కవిత అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరి పంటపై కేంద్ర విధానాలను అనుసరించే తాము ఈ వేసవిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని మాత్రమే రైతాంగాన్ని బతిలాడుతూ చెబుతున్నట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగంలో ముందు ముందు భారీ మార్పులు చోటు చేసుకుంటున్న దృష్ట్యా రైతాంగం ఆ కోవలో పయనించాలని పేర్కొన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా నీటి నిల్వలు పుష్కలంగా పెరిగినందున వివిధ రకాల సబ్సిడీలు పెద్ద మొత్తంలో లభిస్తున్న ఆయిల్ ఫామ్ పంట సాగు పై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందనే భావనతో ప్రజా ప్రతినిధులు ముందుకుసాగాలని వివరించారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి హామీ కింద జరిగిన వివిధ రకాల అభివృద్ధి పనులకు నిధుల చెల్లింపులు జరిగాయని వివరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, తహసిల్దార్ రాంప్రసాద్, వైస్ ఎంపీపీ శ్రీశైలం, ఉమ్మడి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ల డైరెక్టర్ సైదులు, మార్కెట్ చైర్మన్ యాదగిరి, ఏడీఈ, శ్రీనివాస్, ఏవో బాలకృష్ణ, సీడీపీఓ శ్రీజ, ఎంపీడీవో లక్ష్మి, ఉద్యానవన శాఖ అధికారి స్రవంతి, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తహాశీల్దార్ కార్యాలయంలో వారు 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed