- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే జోగు రామన్న ఎవరితో కలిసి ఓటేశారంటే..?
దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శుక్రవారం ఎమ్మెల్యేలు.. జడ్పీ చైర్మన్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న.. స్థానిక కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో కలిసి ఓటు వేశారు. ఉట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం పోలింగ్ కేంద్రం 2లో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్.. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజా ప్రతినిధులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విట్టల్‌ను గెలిపిస్తామని చెప్పుకొచ్చారు.