చంద్రబాబుపై ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర విమర్శలు

by srinivas |
Jogi Ramesh
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన చేసేందుకు చంద్రబాబు నివాసం వద్దకు వెళ్తే గూండాలతో తనపై దాడి చేయించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నువ్వు గుర్తుపెట్టుకో ఇది కేవలం ఆరంభం మాత్రమే భవిష్యత్తులో నువ్వు చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్త అంటూ తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తామేంటో చూపిస్తామంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

జగన్‌పై కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చిరించారు. ఇలాంటి పిచ్చి పనులు చేయిస్తే చంద్రబాబు చెంపపై చెల్లుమని కొడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకనుంచి జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని జోగి రమేశ్ హెచ్చరించారు. నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిపై చంద్రబాబు, ఆయన గూండాలు రాళ్లతో దాడి చేయడం దుర్మార్గమన్నారు.

గూండాలను సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు లుచ్చా పనులు చేయటం సరైనది కాదన్నారు. సొంత మామనే రాళ్లతో, చెప్పులతో కొట్టిన చంద్రబాబు ఇప్పుడు తమపై దాడికి పాల్పడ్డారన్నారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని లాక్కొని ఆయనను అవమానించి దాడి చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కిందంటూ జోగి రమేశ్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed