- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ : జీవన్ రెడ్ది షాకింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్ రెడ్డి అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంచులు, సంచలనాలు, గ్లోబల్ ప్రచారానికి కేర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అని అన్నారు. రేవంత్‌కు రేబిస్ వ్యాధి సోకిందని అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
రాజకీయ పరిపక్వత లేని వ్యక్తి అని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రధాని మోడీని కేసీఆర్ 12 అంశాలపై మాట్లాడటానికే కలిశాడని దీనిపై అడ్డమైన రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి రాజ్యాంగంలోని 263 ఆర్టికల్ స్పష్టంగా చెబుతోందని అది తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేసీఆర్.. మోడీని కలిస్తే మంచి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యూపీలో ఎంఐఎం సీట్ల గురించి వారిద్దరూ మాట్లాడుకున్నారా అని ప్రశ్నించారు.
పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్.. ఆగస్టు 11న పీఎం మోడీని కలిశారని అన్నారు. అప్పుడు దేని గురించి చర్చించారని ప్రశ్నించారు. చైనా రాయబారిని రాహుల్ గాంధీ చాలాసార్లు కలిశాడని.. ఈ క్రమంలో దేశ ద్రోహానికి పాల్పడ్డారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సీతక్కను చంద్రబాబు దగ్గరకు రేవంత్ పంపారని.. కాంగ్రెస్ టికెట్లు నిర్ణయించడానికా దేనికో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్.. గాంధీ భవన్‌ను గాసిప్స్ అడ్డాగా మార్చాడని అన్నారు.
రేవంత్ సినిమాల్లో ఐటమ్ సాంగ్ లాంటోడు అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని.. లేకపోతే రేవంత్‌కు రాజకీయంగా పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఎంపీ తేజస్వి సూర్య.. మా సీఎంను తిట్టినా.. మా మంత్రి కేటీఆర్ ఆయనకు జ్ఞాపిక ఇచ్చారని.. ఇదే టీఆర్ఎస్ సంస్కారమని తెలిపారు. రేవంత్ చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. దమ్ముంటే హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌కి మాట్లాడడానికి ఏమీ లేక భాగ్యనగరాన్ని మారుస్తానని మత విద్వేషాలు రెచ్చగొడుతూ సర్జికల్ స్ట్రైక్ అని మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. పనికి మాలిన వారిని తీసుకువచ్చి పాదయాత్రలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.