రేవంత్ దమ్ముంటే.. సోనియా, రాహుల్‌ను మోడీ ఇంటి వద్ద ధర్నాకు కూర్చోబెట్టు..

by Shyam |   ( Updated:2021-11-30 03:46:03.0  )
jeevan
X

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీభవన్‌ను గాడ్సే భావంగా రేవంత్ రెడ్డి మార్చారని puc చైర్మన్ జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్‌కు నోటుతో ఓట్లు కొనడం తెలుసు తప్ప.. వడ్లు కొనడం గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని లీజుకు తీసుకున్న గలీజ్ గాడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. రేవంత్‌కు దమ్ముంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తెలంగాణ రైతుల కోసం మోడీ ఇంటి దగ్గర ధర్నాకు కూర్చోబెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఒక లక్షల టన్నుల ధాన్యం కొంటే.. ఒక్క సీజన్‌లోనే లక్ష టన్నులు కొన్న చరిత్ర టీఆర్ఎస్‌ది అని అన్నారు.

రేవంత్ కూడా బీజేపీ నాయకుల్లాగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేయకుండా రాష్ట్రాన్ని నిందించడం సమంజసం కాదన్నారు. రైతుల పాలిట దేవుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి కిసాన్‌ల ప్రతినిధి కాదని, ఎన్నికలప్పుడే కిషన్ రెడ్డి.. జై జవాన్.. జై కిసాన్ అని అంటారని ఆ తర్వాత మర్చిపోతారని విమర్శించారు. టూరిజం మంత్రి తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులా మారాడని దుయ్యబట్టారు. ధర్మపురి అరవింద్ ఫేక్ ఎంపీ, అబద్ధాలకోరు అని దుయ్యబట్టారు. అరవింద్ నోటిని గాంధీ ఆసుపత్రి డాక్టర్లతో కుట్టించాలని అన్నారు. లుచ్చా, లపంగా రాజకీయాలు చేస్తున్నది బీజేపీ నాయకులే అని మండిపడ్డారు.

Read more : రైతులపై ప్రేమ ఉంటే ధాన్యాన్ని మీరే కొనండి.. రేవంత్ ఫైర్

Advertisement

Next Story

Most Viewed