- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, జగన్, షర్మిలపై జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రగతి భవన్‌లో జగన్, తాడిపత్రిలో కేసీఆర్.. ఇద్దరు సీఎంలు కలిసి భోజనాలు చేసి.. దాని నుంచి తిట్టుకునే పరిస్థితి చూస్తుంటే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపినట్లు కనిపిస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ ఉద్యమం చేపడితే కాంగ్రెస్ అండగా నిలబడిందని అన్నారు. తాజాగా కృష్ణా జలాలపై టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే రాజకీయ కోణంలో అనుమానించాల్సి వస్తోందన్నారు. కృష్ణా జలాల విషయంలో ఇద్దరు సీఎంల మాటలు చూస్తుంటే రాజకీయ రగడ పుట్టేటట్లు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల ప్రజలు కొట్టుకునే దిశగా వారి తీరు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో తెలుగు ప్రజలకు ఇబ్బంది కలుగవద్దనే నినాదం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
ఇరు రాష్ట్రాలు జలవివాదాల్లో కొట్టుకున్న తరువాత పరిష్కారం దిశగా కేంద్రం వెళ్తదా? అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి.. వైఎస్ కంటే మూర్ఖుడు అనేది ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ప్రగతి భవన్‌కు వచ్చినప్పుడు గుర్తుకు లేదా? అని ప్రశ్నించారు. పీజేఆర్, వైఎస్ఆర్ మధ్య జల వివాదం కంటే రాజకీయ వివాదమే ఎక్కువ ఉందన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కృష్ణా జలాల వివాదంలో అవగాహనతో మాట్లాడుతున్నారా? అజ్ఞానంతో మాట్లాడుతున్నారా? అనేది వారికే తెలియాలన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే జల వివాదాలు ఉండవన్నారు. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త డ్రామా ఆడుతోందని ఆరోపించారు. జగన్, కేసీఆర్, షర్మిల బీజేపీ నీడలో ఉన్నారని, అంతర్గతంగా ముగ్గురు చర్చలు జరిపి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.