‘పీసీసీ నియామకం వాయిదా వేయండి’

by Shyam |
‘పీసీసీ నియామకం వాయిదా వేయండి’
X

దిశ, వెబ్‌డెస్క్: పీసీసీ పదవిపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షులు సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా సోనియా గాంధీకి పలు సూచనలు చేశారు. అంతేగాకుండా తాను పంపిన లేఖ సోనియాగాంధీకి అందుతుందో.. లేదో అని మీడియాకు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీకి లాయల్‌గా ఉండే నాయకత్వాన్ని ఎంపిక చేయాలని… పార్టీలో అంశాల వారీగా కమిటీ వేయాలని కోరారు. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులను గుర్తించి ఐదు నియోజకవర్గాల బాధ్యత అప్పగించాలని.. నాగార్జున సాగర్ ఎన్నికల వరకు పీసీసీ నియామకం వాయిదా వేయాలని సోనియాగాంధీకి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story