- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీపీసీసీ, సిద్దిపేట కలెక్టర్‌పై జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
దిశ, వెబ్‌డెస్క్ : టీపీసీసీ చీఫ్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ నియామకంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. టీపీసీసీ ఎవరనేది అనౌన్స్ అయ్యాక.. లవ్ మ్యారేజ్, అరేంజ్‌డ్ మ్యారేజ్‌లోని చిన్న వ్యత్యాసం మాత్రమే తమ మధ్య ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఇక తెలంగాణ బీజేపీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కలలు కంటూనే ఉండాలని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని వాళ్లు చెబుతున్నారంటే.. తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందని వాళ్లకు వాళ్లుగా ఒప్పుకోవడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కేసీఆర్‌తో.. కాంగ్రెస్ మాటలు పడాల్సివస్తోందని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వెంకట్రామిరెడ్డికి కొల్లూర్‌లో బినామీల పేర్లతో ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌లు గూర్ఖాలకంటే దారుణంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్.. విలువ ఇచ్చే ఉద్యోగమని, కానీ కొంత మంది అధికారులు.. చెప్రసి లాగా మారిపోయారని, ఇలాంటి అధికారులను నేను ఎప్పుడూ చూడలేదని విమర్శలు చేశారు.