- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ ఎఫెక్ట్.. సారీ చెప్పిన జగ్గారెడ్డి
దిశ, డైనమిక్ బ్యూరో : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో శుక్రవారం జరిగిన వ్యవహారం సద్దుమనిగిందని, పార్టీలో మేమంతా అన్నదమ్ముల్లా కలిసి మాట్లాడుకుంటామని, కలిసి పనిచేస్తామని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. గాంధీభవన్‌లో శనివారం జరిగిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల భేటీలో.. రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి వ్యాఖ్యలను మల్లు రవి ప్రస్తావించారు. అయితే, ప్రశ్నించడానికి మీకేం అర్హత ఉందని, వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఉపాధ్యక్షులు ఎలా అడుగుతారని మల్లు రవిపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిద్దరికి ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు సర్ది చెప్పారు.
అనంతరం జగ్గారెడ్డితో ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్ విడిగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్‌పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమావేశంలో చర్చించి దానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం జగ్గారెడ్డి, మహేష్ కుమార్, మల్లు రవిలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో జరిగే అంతర్గత వ్యవహారాలను మీడియాతో మాట్లాడొద్దని పార్టీ పెద్దలు చెప్పినట్లు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడటం తప్పే అని, దానికి సారీ చెప్పానని ఆయన పేర్కొన్నారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ.. నిన్నటి వివాదానికి కమ్యూనికేషన్ గ్యాప్ కారణమని, ఇది మరోసారి జరగకుండా చూసుకుంటామని వెల్లడించారు.