- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాస్పత్రిలో మంచం వేసుకుని ఉండేవాడిని
దిశ, న్యూస్‌బ్యూరో: ప్రస్తుత పరిస్థితుల్లో తాను మంత్రిగా ఉంటే గవర్నమెంట్ ఆస్పత్రిలో మంచం వేసుకుని ఉండేవాడినని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలు చేయడం లేదని, ప్రజల ప్రాణాలు తనకు ముఖ్యమన్నారు. ‘‘నా వ్యూహాలు నాకు ఉన్నాయి.. భవిష్యత్‌లో నా ఆట నేను ఆడుతా’’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే చనిపోతామని ప్రజలు భయపడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంగారెడ్డిలో ఇటీవల టోపి బాబా అనే వ్యక్తి చనిపోయారని, కరోనా కాలంలో ప్రజలకు ఇతర జబ్బులు చేసినా ప్రైవేటు ఆస్పత్రుల వాళ్లు చేర్పించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులకు ఎవరు వచ్చినా జాయిన్ చేసుకుని చికిత్స అందించాలని ఆదేశాలివ్వాలని జగ్గారెడ్డి సూచించారు.