- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ ఉన్నంతకాలం రైతులకు ఏ బాధా ఉండదు
దిశ, యాదగిరిగుట్ట: రాజపేట మండలంలోని సోమారం గ్రామంలో సర్పంచ్ పెరమాండ్ల కిషన్‌తో కలిసి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సోమారం గ్రామ అభివృద్ధికి రూ.25 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన సీఎం కేసీఆర్ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఉచిత కరెంట్‌తో పాటు, ఏ గ్రామంలో పండించిన పంటను ఆ గ్రామంలో అమ్ముకునేలా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేశారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చినా, రైతులకు భారం కాకూడదని కేసీఆర్ ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర రైతాంగం పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, కేసీఆర్ ఉన్నంత కాలం రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం గ్రామ సర్పంచ్‌లో కలిసి ఎస్సీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్, జెడ్పీటీసీ గోపాల్ గౌడ్, ఉప సర్పంచ్ జంపయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, కో-ఆపరేటివ్ బ్యాంక్ సీఈవో సిలివేరు శేఖర్, ఏఓ మాధవి, ఏఈఓ ప్రణీత, వివిధ గ్రామాల సర్పంచులు, మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.