నా అనుభవంతో చెబుతున్నా.. బీజేపీ కార్యకర్తలు అలాంటివారే: ఈటల

by Sridhar Babu |   ( Updated:2021-11-07 03:38:55.0  )
Etela-Rajendhar-1
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ పార్టీ చాలా గొప్పదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు తన గెలుపు కోసం చాలా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు ఆహారం, నిద్ర మాని ప్రచారం నిర్వహించి తన గెలుపులో కీలక పాత్ర పోషించారన్నారు. నిజంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను హుజురాబాద్ ఉప ఎన్నికలో చూశానని, ఇది ఒక బీజేపీలోనే సాధ్యమైతదని తనకు అనిపించిందని ఈటల అన్నారు. ‘ నా రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. బీజేపీలో కమిటెడ్ కార్యకర్తలు ఉన్నారు’ అని ఈటల తెలిపారు.

Advertisement

Next Story