సీఎం కేసీఆర్‌ మైనార్టీలకు ఎంతో కృషి చేశారు: చల్లా ధర్మారెడ్డి

by Shyam |
సీఎం కేసీఆర్‌ మైనార్టీలకు ఎంతో కృషి చేశారు: చల్లా ధర్మారెడ్డి
X

దిశ, పరకాల: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని ముస్లిం మైనారిటీ కమిటీల పెద్దలతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు మసీదులు, ఈద్గా, ఖబరస్తాన్‌‌ల మరమ్మతులు, షాదీఖాన నిర్మాణానికి రూ.65 లక్షల మంజూరు పత్రాన్ని వారికి అందచేశారు. గత ప్రభుత్వాల హయాంలో ముస్లింలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మైనార్టీలకు అండగా నిలిచి, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. మంజూరైన రూ.65లక్షల నిధులతో త్వరగా పనులు ప్రారంభించి పూర్తిచేయాలని మైనార్టీలకు సూచించారు.

Advertisement

Next Story