కుష్టు వ్యాధిగ్రస్తుని బండి లాగుతూ.. ఎమ్మెల్యే భిక్షాటన 

by srinivas |
కుష్టు వ్యాధిగ్రస్తుని బండి లాగుతూ.. ఎమ్మెల్యే భిక్షాటన 
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా లాక్ డౌన్ తో ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. ఎందరో పూట గడవక అల్లాడుతున్నారు. ప్రభుత్వం ఎంత చేసినా ప్రతి ఒక్కరూ దానగుణంతో… అవస్థలు పడుతున్నవారిని ఆదుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన వినూత్న రీతిలో ఖాకీ దుస్తులు, మెడలో ఎర్ర కండువాతో కుష్టు వ్యాధిగ్రస్తుల బండి లాగుతూ తిరుపతి వీధుల్లో భిక్షాటన చేశారు.

మానవత్వంతో కూటికి లేని పేదలను ఆదుకోవాలంటూ… వారికి యాచన ద్వారా వచ్చిన రూ.20 వేలు అందించారు. తనవంతుగా మరో రూ.10 వేలు సాయం చేశారు. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకుంటే.. ఆ తృప్తే వేరని భూమన వ్యక్తం చేశారు. ఎవరికివారు తమ పరిధిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్లని గుర్తించి సాయం చేయాలని అర్థించారు. ప్రజల్లో మానవతను మేలుకొల్పేందుకు మానవ వికాస వేదిక వారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అభినందించారు.

Advertisement

Next Story