క్షణం క్షణం ఉత్కంఠ.. గార్ల మండల అధ్యక్షుడి పదవి ఆయనకే..?

by Sumithra |
క్షణం క్షణం ఉత్కంఠ.. గార్ల మండల అధ్యక్షుడి పదవి ఆయనకే..?
X

దిశ, మహబూబాబాద్(గార్ల) : రాష్ట్రంలో సంస్థాగత కమిటీలను ప్రకటించనున్న దృష్ట్యా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పీఠం గార్ల మండలంలో అధికార పార్టీ నుంచి ఐదుగురు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో గంగావత్ లక్ష్మణ్ నాయక్ పెద్ద కిష్టాపురం గ్రామానికి చెందిన వారు. గార్ల మేజర్ గ్రామ సర్పంచ్ 2013 నుంచి 2018 వరకు టీడీపీ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత 2019లో కాంగ్రెస్‌లో చేరి అటు నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ప్రస్తుతం గార్ల రైతు సహకార సంఘం వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో ఎమ్మెల్యేకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ క్రమంలోనే లక్ష్మణ్ నాయక్ మండల అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. బుడిగ మురళి మండలంలోని సీతం పేట గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు. ఈయనకు ఎంపీ కవితతో సాన్నిహిత్యం ఉంది. యువతలో మంచి ఫాలోయింగ్‌తో పాటు చదువుకున్న యువ నాయకుడు కావడంతో పాటు అధ్యక్ష పదవికోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.

మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన గుండా వెంకటరెడ్డి సీపీఎం పార్టీలో పనిచేసినా మండలంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. అందరినీ చేరదీసి సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. కార్యకర్తలకు వెన్నంటే ఉంటాడని మంచి పేరుంది. ఇతను కూడా అధ్యక్ష పదవి రేసులో తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. పోచారం గ్రామానికి చెందిన లింగాల ఉమేష్ మహబూబాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌కు అత్యంత సన్నిహితుడు. గ్రామంలో, యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఈయన కూడా మండల అధ్యక్ష పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

గతంలో టీఆర్‌ఎస్ గార్ల మండల అధ్యక్షుడిగా పనిచేసిన పానుగంటి రాధాకృష్ణ మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా ఎమ్మెల్యే మదిలో స్థానం సంపాదించుకున్నాడు. అయితే రాష్ర్ట, నియోజక వర్గ పరిశీలకులకు మాత్రం రాధాకృష్ణ పై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడింది. గతంలో ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో అధిష్టానం మండల అధ్యక్ష పదవి ఇవ్వకుండా బుజ్జగించే ప్రయత్నాలు ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చేస్తున్నట్టు తెలుస్తోంది.

అధ్యక్ష పదవీ కాకుండా రైతు సమన్వయ మండల కన్వీనర్ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మండలంలో ఐదుగురు నేతలు పోటీలో ఉన్నా, ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులతో ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తున్నారు. అయితే, గంగావత్ లక్ష్మణ్ నాయక్ పేరును మాత్రం ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఫైనల్ చేసినట్టు సమాచారం. చివరగా ఎమ్మెల్యే ఎవరి పేరును ప్రకటిస్తుందోనని గార్ల మండలంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story